Friday, April 26, 2024
Friday, April 26, 2024

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు మా ఉద్యమాలు ఆగవు…

శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
సిపిఐ ఏపీ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జింకా చలపతి
సిపిఐ ఏపీ చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షులు పిల్లలమర్రి నాగేశ్వరరావు

విశాలాంధ్ర – ధర్మవరం : చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు మా పోరాటాలు ఆగవని శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్, సిపిఐ ఏపీ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జింక చలపతి, ఉపాధ్యక్షులు పిల్లలమర్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయ ముందు ఆవరణంలో చేనేత కార్మికులు చేపట్టిన దీక్ష కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. దీక్షలో జింక చలపతి, వెంకటస్వామి, రమణ, మంజునాథ్, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, చంద్ర లకు పూల హారాలు వేసి, దీక్షకు మద్దతు పలికారు. ఈ దీక్ష కార్యక్రమానికి కైకాల చేనేత కార్మిక సంక్షేమ సంఘం విజయవాడ నాయకులు కేలసాని సాయికుమార్, ధర్మవరం నియోజకవర్గం కార్యదర్శి మధు, సిపిఎం ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు కూడా ఈ దీక్ష కార్యక్రమానికి విచ్చేసి చేనేత కార్మికుల సమస్యలను తెలియజేశారు. అనంతరం వేమయ్య యాదవ్, జింకా చలపతి, పిల్లల మర్రి నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ చేనేత కార్మికుల యొక్క హక్కులను నిలదీసి సమస్యలను పరిష్కరించుకోవలసిన సమయం కూడా నేడు ఆసన్నమైనదని, 11 రకాల డిమాండ్ లో స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ ఎందుకు కాలయాపన చేస్తున్నారో అర్థం కావడం లేదని వారిపై మండిపడ్డారు. చేనేత కార్మికుల రిజర్వేషన్ చట్టంలో కలెక్టర్ అమలు చేయడానికి ఎమ్మెల్యే అడ్డంకులు తెలపడం దారుణం అన్నారు. పవర్లూమ్స్ యాజమాన్యంతో ఎమ్మెల్యే కుమ్మక్కై జీవోను అమలు చేయడం లేదని, పవర్లూమ్స్ ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నాడని వచ్చే ఎన్నికల్లో వారి సహాయం కావాలన్నా ఉద్దేశంతోనే చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. చేనేత కార్మికులఆకలి చావులు, ఆత్మహత్యలు లేకుండా, చేయాల్సిన బాధ్యత కలెక్టర్ది కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ చేనేత కార్మికులకు ఇంతవరకు చేసింది శూన్యమని వారు తెలిపారు. నేడు చేనేత కార్మికులందరూ పోరాడి సాధించి సంఘటితంగా కలిసి ఉన్నప్పుడే మనకు న్యాయం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో చేనేత కార్మికుల ఆత్మహత్య చేసుకుంటే ఎమ్మెల్యేని బాధ్యత వహించాలని హెచ్చరించారు. త్వరలోనే మా సమస్యలు పరిష్కరించకపోతే ఎమ్మెల్యే ఇంటి వద్ద కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేసేంతవరకు మా పోరాటాలు ఆగని వారు తెలిపారు. చేనేత పరిశ్రమలు నమ్ముకున్న చేనేత కార్మికులకు సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సీపీఎస్ ను రద్దు చేయకుండా, ఢిల్లీ టూర్ లో రాష్ట్ర ప్రజలు, చేనేత కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా తన కేసులను మాఫీ చేసుకునేందుకే వెళుతున్నారని వారు దుయ్య బట్టారు. చేనేత రిజర్వేషన్ను ప్రభుత్వాలు మారినా, చేనేత కార్మికుల బ్రతుకులు మారడం లేదని, చేనేత రిజర్వేషన్ చట్టమును ఎందుకు అమలు చేయలేకపోతున్నారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా చేనేత పై 18 శాతము జిఎస్టి పన్నును ఎందుకు రద్దు చేయలేకపోతున్నారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల దారి ఎటు వెళుతుందని? వారి ఉపాధి ఎలా ఉంటుందని? వారి భవిష్యత్తు ఎలా ఉంటుందని? ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయటం లేదని తెలిపారు. చేనేతల భరోసా కోసమే నేడు 36 గంటల దీక్షను చేపట్టడం జరిగిందని తెలిపారు, మంగళవారంతో ఈ దీక్ష ముగుస్తుందని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయమును ధర్మారంలోని ఏర్పాటు చేయాలని, సిల్క్ రాయితీ స్కీమును పునరుద్దించాలని, 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చేనేత పై జిఎస్టిని రద్దు చేయాలని తెలిపారు. ధర్మవరంలో మెగా చేనేత క్లస్టర్ను ఏర్పాటు చేయాలని ఇంతవరకు ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబానికి ఎక్స్గ్రేషియాను 1.5 లక్షల నుండి ఐదు లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు రాయితీపై మెటీరియల్ను సరఫరా చేసి అమ్మకముపై మార్కెట్ సపోర్టు సైజులు ఇవ్వాలని తెలిపారు. ఈ దీక్షా కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన మద్దతును తెలిపారు. అనంతరం వన్టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం ఎస్సై మహమ్మద్ రఫీలు దీక్ష వద్దకు చేరుకొని మైకు కు అనుమతి లేదని తెలపడంతో నాయకులకు, చేనేత కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్ని వాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో తాలూకా కార్యదర్శి వెంకటనారాయణ,రైతు సంఘం జిల్లా కార్యదర్శి జే. వి. రమణ, పట్టణ కార్యదర్శి రవి, సిపిఎం ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా, కార్యదర్శి కుల్లాయప్ప, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పోతులయ్య ,కార్యవర్గ సభ్యులు విజయభాస్కర్ లతోపాటు వందలాదిమంది చేనేత కార్మికులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img