Friday, October 25, 2024
Friday, October 25, 2024

స్థానిక సంస్థలఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన మంగమ్మ

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గానికి చెందిన సానిపల్లి మంగమ్మ ను వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈమె కళ్యాణ్ దుర్గం మండలం సిబాయికి చెందినది ఈమెను పెనుకొండ మండలానికి చెందిన మునిమడుగు గ్రామానికి చెందిన గంగాధర్ వివాహము చేసుకున్నారు గంగాధర్ వాల్మీకుల్లో మంచి పట్టున్న బలమైన నాయకుడిగా పేరు ఉంది ఆయన కొన్ని రోజులపాటు స్వచ్ఛంద సంస్థల పని చేస్తూ సొంతంగా తనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్నాడు అనంతరం ఆయన కొన్ని రోజులపాటు యంగ్ ఇండియాలో పని చేస్తూ యంగ్ ఇండియా వ్యవస్థాపకులు కిరణ్ బేడి ద్వారా మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడింది, అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ద్వారా గంగాధర్ కు రాజశేఖర్ రెడ్డి తో పరిచయం ఏర్పడి రాజకీయంగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించారు 1987లో సింగల్ విండో అధ్యక్షులుగా ఎంపికయ్యారు అనంతరం 1989 సంవత్సరములో హిందూపురం పార్లమెంట్ సభ్యునిగా ఎంపికయ్యారు 1991 నుంచి 96 వరకు హిందూపురం ఎంపీగా పని చేశారు 96లో జరిగిన ఎన్నికలలో రామచంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు అలాగే 98 లో జరిగిన ఎన్నికలలో ఎంపీగా ఎన్నికయ్యారు అనంతరం ఆయన 2006వ సంవత్సరంలో అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు అనంతరం వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి తో అవినాభావ సంబంధం ఉండటం వలన మంగమ్మ ను వైయస్ జగన్మోహన్ రెడ్డి తన యొక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీఈ సీ మెంబర్ గా పనిచేసింది కొన్ని రోజులపాటు పెనుకొండ నియోజకవర్గానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యతలు కూడా నిర్వహించారు అనంతరం వారి కుటుంబానికి రాజకీయంగా ప్రోత్సహించాలని ఉద్దేశంతో గంగాధర్ కుమారుడికి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు కానీ జెడ్పిటిసి గా అభ్యర్థి గెలవలేక పోగా జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థులు గెలవలేకపోయినందున జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వచ్చినట్లే వచ్చి పోయింది వారి కుటుంబాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గంగాధర్ కుటుంబానికి గంగాధర్ భార్య మంగమ్మకు ఎమ్మెల్సీ అభ్యర్థిగాఎంపిక చేయడం వలన హిందూపురం పార్లమెంటు సత్య సాయి జిల్లా నందు అత్యధిక సంఖ్యలో ఉన్న బోయ కులస్తులు వాల్మీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ కూడా మంగమ్మకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా రావడానికి కృషి చేశారని రాజకీయ పరిశీలకులు తెలుపుతున్నారు పెనుకొండ నియోజకవర్గం నందు బోయ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు మరియు కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు అధికంగా ఉండడం వలన రెండు కులాల వారికి చట్టసభలలో ప్రాతనిధ్యం ఉండడం వలన రాబోయే ఎన్నికలలో కుల ప్రాతిపదికన టికెట్లు కేటాయించిన గెలుపు సునాయాసం కాగలదని పరిశీలకులు భావిస్తున్నారు అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఎంపీ పదవి బోయలకు జిల్లా పరిషత్ చైర్మన్ బోయలకు డిసిసి చైర్మన్ పదవి బోయ వారికి కేటాయించినందున హిందూపురం పార్లమెంటు సత్య సాయి జిల్లాలో కురబ కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నందున ఈసారి స్థానిక సంస్థల కోటాలో బోయ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించినట్లు రెండు సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యతతో పార్టీ ఆలోచించి మంగమ్మ ను ఎంపిక చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు అందరి ఆమోద్యోగంతో మంగమ్మ రాజకీయంగా రాణించాలని ఆమె అనుచరులు కుల బాంధవులు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img