Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మేడే స్ఫూర్తితో పోరాడాలి


– సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నబి రసూల్

విశాలాంధ్ర – ఆలూరు : కార్మికుల హక్కుల కోసం, ప్రైవేటీకరణ, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు మేడే స్ఫూర్తితో పోరాటాలు కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నబి రసూల్ పిలుపునిచ్చారు. సోమవారం ఆలూరు పట్టణంలో 137వ మేడే వేడుకలను ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా చెక్ పోస్ట్ నుండి బస్టాండ్ వరకు ఏఐటియుసి ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు మేడే స్ఫూర్తిని చాటుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నబీరసూల్ పాల్గొని ఏఐటియుసి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నబి రసూల్, భూపేష్ లు మాట్లాడుతూ చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో మేడే దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నప్పటికీ నేటి భారత పాలకులు పోరాడి సాధించిన హక్కులను కాలరాసే పద్ధతుల్లో చట్టాలను నీరు కారుస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడుదారులకు, కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా కట్టపెడుతూ ఉపాధిని హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటం చేసే ప్రజల మధ్య మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్వేషాలను పెంచి ప్రజా హక్కులను కాలరాస్తున్నారని, తమ హక్కుల కోసం కార్మిక కర్షకులు అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి తాలూకా అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, శివ, హోతూరప్ప, ఏఐటీయూసీ తాలూక మాజీ అధ్యక్షులు ఎస్ఎస్ భాష, శివ, గోవిందప్ప, నల్లన్న, పాండు, రామాంజనేయులు, పులి, గోపాల్, కార్మిక సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img