Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ఆన్లైన్లో రైతుల పేర్లు నమోదు చేయాలి

సిపిఐ డిమాండ్

విశాలాంధ్ర-ఆదోనిటౌన్: రైతుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే అజయ్ బాబు భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సబ్ డివిజన్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో సర్వే నెంబర్ 177/1 177/3A 177/3B 174/3 లో ఉన్న భూ సమస్యను పరిస్కరించాలని గతంలో ప్రభుత్వ. భూమి నిరు పేద రైతుల దగ్గర ఉన్న భూమిని మాజీ వీఆర్వో మాబు పటేలు పెత్తందారుడైన లక్ష్మన్న అనే వ్యక్తికి ముడుపులకోసం అమ్ముకోవడo జరిగిందని ఆరోపించారు. ఈవిషయంపై గత 8 నెలలుగా పోరాడుతున్నా అధికారుల్లో చలనం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ భూమిని తిరిగి రైతులకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం కార్యాలయ పరిపాలనాధికారి గోవిందరాజ్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఆదోని పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ పెద్ద కడువూరు మండల కార్యదర్శి వీరేష్, ఆదోని సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి విజయ్ రైతు సంఘం నాయకులు ఆంజనయ్య తిక్కన్న గోపాల్ ,వీరేష్ నాయక్, సర్తాజ్ పటేల్, జాఫర్ పటేల్, ఇర్ఫాన్ పటేల్ , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img