Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎన్ ఐ ఆర్ ఎఫ్ ర్యాంకింగ్స్ ప్రగతికి మెట్లు

విశాలాంధ్ర – జేఎన్టీయూఏ: ఎన్ ఐ ఆర్ ఎఫ్ ర్యాంకింగ్స్ ప్రగతికి మెట్లు అని విశ్యేశ్వరయ్య టెక్నాలజీ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య కె. బాల వీరా రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జేఎన్టీయూ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలోని సెమినార్ హాల్లో ఎన్ ఐ ఆర్ ఎఫ్ ర్యాంకింగ్స్ పై విశ్వవిద్యాలయం ఆచార్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ర్యాకింగ్స్ ను ఎలా పొందాలో , అభివృద్ధి , పరిశోధన, బోధన, సాంకేతిక వనరుల , జాతీయ అంతర్జాతీయ ప్రచురణలు, యూనివర్సిటీలు వనరులను మొదలగు అంశాలపై విస్తృతంగా వివరించారు. అనంతరం ఉపకులపతి జింక రంగా జనార్దన్ మాట్లాడుతూ.. ర్యాంకింగ్స్ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో రెక్టార్ యం. విజయ కుమార్ , రిజిస్ట్రార్ శశిధర్ , డైరెక్టర్ ఆచార్య సుబ్బారెడ్డి , వి. సుమలత , యూనివర్సిటీ డైరెక్టర్లు, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.సుజాత , వైస్ ప్రిన్సిపాల్ భవాని , వివిధ విభాగధిపతులు, పి ఆర్ ఓ రామశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img