Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

చేనేత దీక్షలకు స్పందించిన చేనేత జోలి శాఖ అధికారులు

. పుట్టగొడుగుల్లా పవర్లూమ్స్ ఏర్పాటు చేస్తున్న, పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్న హ్యాండ్లూమ్ అధికారులు
. ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి సంక్షేమ పథకం చేనేత కార్మికునికి విధిగా అందాలి.
. చేనేత రిజర్వేషన్ యాక్ట్ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఉద్యమాలు చేపడతాం.
. అర్హులైన చేనేత కార్మికులకు పెన్షన్, ముద్రలోను, నేతన్న నేస్తం, రాయితీలను విధిగా అమలుపరచాలి.


విశాలాంధ్ర – ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికుల జీవన పరిస్థితులు అగమ్య గోచరంగా తయారు కావడంతో ,ఏపీ చేనేత కార్మిక సంఘం (సిపిఐ) ప్రధాన కార్యదర్శి జింకా చలపతి ఆధ్వర్యంలో ఇటీవలే పట్టణంలోని కాయగూరల మార్కెట్లో జిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో వందలాదిమంది కార్మికులతో చేనేత సమస్యలపై పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహించిన విషయం అందరికీ వితీతమే. సమావేశంలో తీసుకున్న తీర్మానాల ప్రకారం 36 గంటల పాటు పట్టణంలో చేనేత దీక్షలు కూడా వ్యవహరించడంతో, అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం, తదుపరి చేనేత జౌళి శాఖ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. దీంతో స్పందించిన కమిషనర్ ధర్మారంలోని చేనేత పరిశ్రమ యొక్క సమస్యలపై తగు నివేదికలు ఇవ్వాలన్న ఉత్తర్వుల మేరకు గురువారం పట్టణంలోని సెరిఫెడ్ కార్యాలయంలో చేనేత కార్మిక సంఘం నాయకులు, పట్టణంలోని చేనేత కార్మికుల తో”చేనేత కార్మికుల ఆత్మీయ సమావేశమును”చేనేత జౌళి శాఖ/ ఎన్ఫోర్స్మెంట్ తిరుపతి అధికారి- రాజారావు, శ్రీ సత్య సాయి జిల్లా సహాయ చేనేత అండ్ జౌళి శాఖ అధికారి రమేష్, సహాయ సంచాలకులు తిరుపతి అధికారి- అప్పాజీ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చేనేత కార్మికుల యొక్క ఆవేదన, ఆక్రందనలతో సమస్యలను అధికారులకు తెలియజేశారు. ప్రభుత్వం నియమించిన అధికారులు చేనేత పరిశ్రమపై ఏ మాత్రం శ్రద్ధ లేదని, పవర్లూమ్స్ వారికే వత్తాసు పలకడం ఏమిటని కార్మిక సంఘం నాయకులు కార్మికులు నిలదీశారు. అంతేకాకుండా తూతూ మంత్రంగా పట్టణంలో ఆకస్మిక దాడులు నిర్వహించడం, తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన పుట్టగొడుగుల పట్టణంలో నేడు పవర్లూమ్స్ పుట్టుకొస్తున్నాయని ఆవేదనలను కార్మికులు వ్యక్తం చేశారు. అనంతరం ఏపీ చేనేత కార్మిక సంఘం సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింక చలపతి, ఏపీ చేనేత కార్మిక సంఘం సిపిఎం రాష్ట్ర ప్రధాన అధ్యక్షులు పోలా రామాంజనేయులు చేనేత కార్మికుల సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించడం, పరిష్కరించకపోవడం పరిపాటిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జింకా చలపతి, పోలా రామాంజనేయులు మాట్లాడుతూ చేనేత కార్మిక సంఘాలు కార్మికులు యొక్క సమస్యలను వినడానికి వచ్చిన అధికారులకు తొలుత ధన్యవాదాలు తెలిపారు. తదనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ దేశంలోనే రెండవ స్థానంలో ఉందని, అటువంటి చేనేత పరిశ్రమలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గానీ సంబంధిత అధికారులు గానీ పట్టించుకోకపోవడం వల్లనే ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతుండడం బాధాకరమన్నారు. పవర్లూమ్స్ లో నిర్దేశించిన చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలుపరచకుండా హ్యాండ్లూమ్స్ చీరలను కూడా తయారు చేయడం ఎంతవరకు సమంజసం? అని అధికారులను వారు నిలదీశారు. నేడు చేనేత కార్మికులకు ఉపాధి లేక, చేసే వృత్తిలో చీరకు గిట్టుబాటు ధర లేక ఉపవాసాలు ఉండడం జరుగు తోందని, దీనికి బాధ్యత.. అధికారులా ?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలా ?అని నిలదీశారు. చేనేత కార్మికుల సమస్యలను అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేసినా ?పరిష్కరించకపోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన పింఛను, ముద్రలోను, నేతన నేస్తం, రాయితీలను అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపారు. ముడి సరుకు ధరలు ఆకాశాలకు అంటినా కూడా పట్టినట్లు వ్యవహరించడం చేనేత కార్మికులకు శాపంగా మారిందన్నారు. కుల, మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఈ చేనేత పరిశ్రమను, అధికారులు ప్రత్యేకంగా చొరవ చూపి చేనేత కార్మికులతో పాటు చేనేత పరిశ్రమను కాపాడాలని వారు తెలియజేశారు. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారినా కూడా చేనేత పరిశ్రమ కుంటుపడుతోందని, ఇందుకు కారకులైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. చేనేతలకు ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేస్తే గాని, చేనేత కార్మికుల అభివృద్ధి జరగదని తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలపై కొద్దిసేపు కార్మిక సంఘాల నాయకులకు, అధికారులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. చివరకు స్పందించిన అధికారులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా ఉండడం బాధాకరమని, ఇకనుంచి తాము పవర్లూమ్స్ పై ప్రత్యేక టీమును ఏర్పాటు చేసి ప్రత్యేక దాడులను నిర్వహిస్తూ, రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయని పవర్లూమ్స్ పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. ప్రత్యేక టీమిలో జోలీ శాఖ, హ్యాండ్లూమ్స్, రెవెన్యూ, పోలీసులు, టాక్స్, తదితర విభాగాల అధికారులతో రహస్య దాడులను నిర్వహిస్తామని వారు హామీ ఇచ్చారు. చిట్టి చివరిగా కార్మిక సంఘ నాయకులు అనుభవము కలిగిన చేనేత కార్మికులు మాట్లాడుతూ ఇకనుంచి పవర్ లూమ్స్ లో రిజర్వేషన్ చట్టం అమలు చేయకపోతే, పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం జైలుకైనా వెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు వెంకటనారాయణ, వెంకటస్వామి, మంజునాథ్, రమణ, శ్రీధర్, విజయభాస్కర్, ఎస్హెచ్ భాష, ఆదినారాయణ, వందలాదిమంది చేనేత కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img