కౌన్సిలర్ కత్తే ఆదిలక్ష్మి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే వైయస్సార్సీపి ప్రభుత్వం యొక్క లక్ష్యమని కత్తె ఆదిలక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం వార్డులో పర్యటిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, పరిపాలన విధానంపై ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించారు. అనంతరం కౌన్సిలర్ కత్తె ఆదిలక్ష్మి మాట్లాడుతూ నవరత్నాల పేరిటతో ప్రతి ఇంటికి సంక్షేమమును ప్రభుత్వం నిర్వహిస్తోందని, అన్ని వర్గాల వారికి అభివృద్ధి బాటలో వెళ్లేందుకు వివిధ సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం వల్లనే ప్రజలు ఈ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నిధులతో నీటి కొరత లేకుండా చూస్తున్నామని, సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు కూడా నిర్మాణాలు అవుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా తాగునీటి కొరత లేకుండా కూడా తగిన చర్యలు మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల తీసుకోవడం జరుగుతోందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.