విశాలాంధ్ర-తాడిపత్రి: నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగలం పాదయాత్రను నియోజకవర్గంలోని ప్రజలు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్తలు విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం పత్రికా ముఖంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్ర విజయవంతం కావడానికి ప్రజలు కార్యకర్తలు నాయకులు ఎంతో కృషి చేశారు. 2024 సంవత్సరంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. దాదాపు 40 సంవత్సరాల నుండి రాజకీయంగా మమ్మల్ని ఆదరించిన నియోజక వర్గ ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉన్నాను అన్నారు.