Monday, June 5, 2023
Monday, June 5, 2023

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడమే మా లక్ష్యం… జనసేన పార్టీ నాయకులు

విశాలాంధ్ర- ధర్మవరం : రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, చిలకం మధుసూదన్ రెడ్డి ధర్మవరం ఎమ్మెల్యేగా గెలుపొందాలని కోరుతూ శుక్రవారం జనసేన పార్టీ నాయకులు కెలవత్ నాయుడు ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ, కడపల సుధాకర్ రెడ్డి, ధారా గంగాధర్, గొంగటి హరి, వెంకటేష్ నాయక్, నారాయణస్వామి నాయక్, మాలేపాటి శ్రీరాము అందరూ కలిసి పట్టణములోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయముతోపాటు, పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మారం నుంచి తిరుమలకు కాలినడకతో యాత్ర కొనసాగిస్తామని, ధర్మవరంలో చేనేత వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా, అదేవిధంగా పేదరికం పోవాలన్న, ముస్లిం మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల వారు బాగుపడాలన్న, రైతుల కష్టాలు తెరిచిన వ్యక్తి, రైతుల కష్టాలు పోవాలన్నా స్థానికులైన చిలకం మధుసూదన్ రెడ్డి ధర్మారం ఎమ్మెల్యేగా అవుతూ గెలుపొందాలన్న కోరికతో తిరుమల వెంకటేశ్వర స్వామి వద్దకు కాలిబాటన పాదయాత్ర చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ పాదయాత్రకు మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు, మండలాధ్యక్షులు నాగ సుధాకర్ రెడ్డి ,పురం శెట్టి రవి, చంద్ర బాబు నాయుడు ,జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయ రామాంజనేయులు, బాలకృష్ణ, కార్యనిర్వాహన కమిటీ సభ్యులు పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, బండ్ల చంద్రశేఖర్, రామకృష్ణ నాయక్, తలారి ప్రతాప్ తో పాటు 100 మందికి పైగా వారు సంఘీభావం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img