Friday, June 2, 2023
Friday, June 2, 2023

మసీదులలో పరిశుభ్రతకు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆర్థిక సహాయం

విశాలాంధ్ర- ఉరవకొండ : పవిత్ర రంజాన్ మాసంలో ఉరవకొండ పట్టణంలో ఉన్న ఐదు మసీదులను పరిశుభ్రంగా ఉంచేందుకు ఒక్కో మసీదుకు 15 వేలు రూపాయలు చొప్పున ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆర్థిక సహాయం చేసినట్లు ఉరవకొండ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం నాయకులు తెలిపారు శుక్రవారం ఉరవకొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కేశవ్ ముస్లిం సోదరులకు రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూనే ముస్లిముల పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానులను చాటుకుంటూ వారి యొక్క ఆయురారోగ్యాలు బాగా ఉండాలని కోరుకుంటూ ఈ సహాయాన్ని అందించినట్లు వారు తెలిపారు. ఎమ్మెల్యే మసీదులలో పరిశుభ్రతకు ఆర్థిక సహాయం చేయడం పట్ల పట్టణ ముస్లిం మైనార్టీ సోదరులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img