Friday, April 26, 2024
Friday, April 26, 2024

క్షయ నిర్మూలనకు అందరూ సహకరించాలి.. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ పద్మలత

విశాలాంధ్ర -ధర్మవరం : క్షయ నిర్మూలనకు అందరూ సహకరించాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ పద్మలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పిపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్.. శ్రావణి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత, యునాని డాక్టర్ ఖాదర్, టీబీ యూనిట్ సిబ్బంది కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ, ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పద్మలత మాట్లాడుతూ క్షయ ఒక అంటూ వ్యాధి అని, తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయని వారు తెలిపారు. రెండు వారాలకి మించి తగ్గు, గల్ల పట్టడం, బరువు తగ్గుట, ఆకలి లేకపోవడం, ఉమ్మిలో రక్తం పడటం, తదితర లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఖరీదైన క్షయ వ్యాధి మందులను ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని, క్షయ రోగులకు 6 నెలల నుండి 18 నెలల పాటు వైద్య చికిత్సలు కూడా ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా క్షయ రోగులకు చికిత్స సమయంలో ప్రతినెలా 500 రూపాయలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహార సహాయం కొరకు ఁనిశ్చయ మిత్ర గాఁ చేరి, క్షయ నిర్మూలలలో భాగస్వాములు కావాలని తెలిపారు. అంతేకాకుండా క్షయ వ్యాధిగ్రస్తులకు శ్రేయ హాస్పిటల్ డాక్టర్ కుమార్ బాబు, షామీర్ భాష 22 మంది క్షయరోగులను దత్తత తీసుకొని, ఆరు నెలలు పాటు ఉచితంగా పౌష్టిక ఆహారమును అందజేయడం సంతోషదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇందురేఖ, పిపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ శ్రావణి, యునాని డాక్టర్ ఖాదర్, టీబీ యూనిట్ సిబ్బంది క్రిష్టప్ప, రహమత్ బాషా, చంద్రకళ, సావిత్రి, పి పి యూనిట్ సిబ్బంది లక్ష్మి నారాయణ తో పాటు ఆశా వర్కర్లు, ఐసిటిసి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img