Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ప్రమాదాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఫైర్ ఆఫీసర్ రాజు

విశాలాంధ్ర – ధర్మవరం : ప్రమాదాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు అవగాహన కూడా ఎంతో అవసరమని ఫైర్ ఆఫీసర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిమాపక వారోత్సవాల్లో సందర్భంగా గురువారం ఐదవ రోజు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల రిలయన్స్ ట్రెండ్స్ షాపింగ్ మాల్ నందు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వాటర్ డెమో ద్వారా తెలియజేయడం జరిగిందని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఆరిపే పద్ధతులు కూడా తెలపడం జరిగిందన్నారు. అనంతరం అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన విధి విధానాలను తెలిపే కరపత్రాలను బ్రోచర్లను కూడా పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అదేవిధంగా వ్యాపారస్తులు, ఇతర వాణిజ్య సంస్థలు విద్యుత్ వినియోగంలో తగిన జాగ్రత్తలను తీసుకుంటూ, రాత్రిపూట దుకాణంలో ఉండే విద్యుత్తును ఆఫ్ చేసి తాళాలు వేసుకొని వెళ్లాలని ప్రతి ఒక్కరూ అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా ఉంచుకోవాలని, తద్వారా ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, యాజమాన్యం, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img