Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

బటన్ నొక్కినా.. నగదుపడేని విద్యా దీవెన

పి ఎస్ యు విద్యార్థుల డిమాండ్
విశాలాంధ్ర – ధర్మవరం : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కొరకు బటన్ నొక్కిన నగదు విద్యా దీవెన ద్వారా పడలేదని పెండింగ్లో ఉన్న ఆ డబ్బులను వెంటనే విడుదల చేయాలని పి.ఎస్.యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నరేంద్ర, సుబ్బరాయుడు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ ఫార్మసీ నర్సింగ్ ఐటిఐ కళాశాలలో లక్షలాదిమంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారని వీరందరికీ అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసం వరకు త్రైమాసిక మాసాలకు విద్యా దీవెనలు 78 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు మార్చి ఒకటవ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి, ప్రకటించిన కూడా, ఇంతవరకు ఆ డబ్బులు విద్యార్థుల ఖాతాలలో జమ కాలేకపోవడం దారుణమని తెలిపారు. నేడు ఆ డబ్బులు లేకపోవడంతో విద్యార్థులు అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా కళాశాల యాజమాన్యం ప్రభుత్వం ఇచ్చే ఫీజులతో మాకు సంబంధం లేదు కళాశాల నిర్ణయించిన ఫీజులు మొత్తం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడం నిజంగా బాధాకరమని వారు తెలిపారు. బటన్ నొక్కి 49 రోజులు గడువు ముగిసిన కూడా ఫీజులు అందకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, కళాశాల యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక చాలామంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, విద్యార్థులకు నిధులను వెంటనే విడుదల చేసి, ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమములో నాయకులు హరి, అయ్యన్న, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img