Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

కార్మికులకు అగ్నిమాపక నివారణపై శిక్షణ తప్పనిసరి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా అగ్నిమాపక అధికారి వి.శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా సహాయ అగ్నిమాపకాధికారి కె పి లింగమయ్య ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంజీఎం స్ప్రింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంజీఎం పెట్రోల్ బంక్, గ్యాస్ ఏజెన్సీ లో పనిచేస్తున్న వారికి అగ్నిమాక నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కార్మికులకు ముందస్తుగా అగ్ని ప్రమాద జరిగినప్పుడు ఏ విధంగా వాటిని నివారించడానికి యాజమాన్యం తగిన శిక్షణ తప్పనిసరిగా ఇప్పించాలి. పెట్రోల్ బంక్ ఉండే ప్రదేశాల్లో అక్కడ వెళ్లేవారు సెల్ఫోన్ ద్వారా సంభాషించరాదన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు, ఏజెన్సీ సభ్యుల చేత సిలిండర్ లో నుంచి అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా దాన్ని ఆర్పి వేయాలో డెమో ద్వారా తెలియజేశారు. అనంతరం అగ్నిమాపక నివారణ అవగాహన కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది బి.వెంకటేశ్వర్లు ఎల్ ఎఫ్, ఎఫ్ఎం లు కే అనిల్ కుమార్, ఏ.వంశీకృష్ణ, డి. రవి శంకర్ నాయక్ (డి ఓ బి ), డి.శివతేజ, కార్మికులు, ఏజెన్సీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img