Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎస్కేయూ క్యాంపస్ స్కూల్లో ఆర్డిటి మిక్స్డ్ జెండర్ సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలు

విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం జిల్లా ఆర్డీటీ సంస్థ నిర్వహిస్తున్న మిక్స్డ్ జెండర్ సాఫ్ట్బాల్ క్లబ్ పోటీలు గురువారం ఎస్కేయూ క్యాంపస్ స్కూల్లో జరిగాయి. ఈ క్రీడా పోటీలలో ఆర్డీటీ సాఫ్ట్ బాల్ క్లబ్ లు అయిన కళ్యాణదుర్గం, ఎస్కేయూ, రాప్తాడు, బత్తలపల్లి నుండి అండర్-14 లోపు బాల బాలికల మిక్స్డ్ జెండర్ సాఫ్ట్బాల్ టీంలు పాల్గొన్నాయి.
ముఖ్య అతిథి సాయి కృష్ణ మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలు గ్రామీణ క్రీడాకారాలు క్రీడా స్ఫూర్తిని రగిలిస్తాయని వాటి ద్వారా క్రీడాకారులు తమలోని నైపుణ్యాలను పెంపొందించుకొని సమాజంలో ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకెళ్లడానికి దోహదపడతాయన్నారు. ఏపీ సాఫ్టుబాల్ సీఈఓ సి.వెంకటేసులు మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ సహకారంతో సాఫ్ట్ బాల్ క్రీడ ఎంతో ఉన్నతమైన లక్ష్యాలకు చేరుకుందన్నారు. నిర్వాహకులు పోటీల్లో పాల్గొన్న జట్లకు లీగ్ పద్ధతిలో క్రీడా పోటీలు నిర్వహించగా ఎస్కేయూ క్యాంపస్ క్లబ్ జట్టు విన్నర్ గా, బత్తలపల్లి కేజీబీవీ క్లబ్ జట్టు రన్నర్ గా నిలిచింది. ఇక్కడ గెలుపొందిన విన్నర్, రన్నర్ జట్లు అర్.డి.టి నిర్వహించనున్న సెంట్రల్ జోన్ మిక్స్డ్ జెండర్ క్రీడా పోటీలలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సి. నాగేంద్ర, ఆర్డీటీ గ్రాస్ రూట్ లెవెల్ కోఆర్డినేటర్ ఓబులేసు, రాప్తాడు పిడి ఎన్. కేశవమూర్తి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img