Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

సచివాలయ కన్వీనర్లు మరియు గృహసారథుల సమీక్ష సమావేశం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండలోని ఎమ్మెల్యే గారి కార్యాలయం నందు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించడమైనది. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలను అందరినీ సమన్వయం చేసి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని కలిసి గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు అందిస్తున్న విధానం గురించి వివరిస్తూ భవిష్యత్తు తరాలకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరాన్ని గుర్తుచేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని సచివాలయ కన్వీనర్లకు, గృహసారథులకు మరియు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండలం మండల అధ్యక్షులు గీత రామ్మోహన్ రెడ్డి అగ్రి చైర్మన్ కొండల రాయుడు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నరసింహప్ప వైస్ ఎంపీపీ రామాంజనేయులు శ్యాం నాయక్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img