Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సైకాలజీలో సమకాలిన దోరణలు” జాతీయ సదస్సులో వక్తలు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : సైకాలజీ నేటి సమాజం కి చాలా అవసరమని శుక్రవారం స్థానిక
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని అనువర్తిత మనోవిజ్ఞానశాస్త్రం (అప్లైడ్ సైకాలజీ)శాఖ ఆధ్వర్యంలో “సైకాలజీలో సమకాలీన ధోరణలు” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు లో వక్తలు పేర్కొన్నారు. ముందుగా విశ్వవిద్యాలయం తాత్కాలిక క్యాంపస్ లోని దీన్ దయాళ్ సమావేశ మందిరంలో జరిగిన ప్రారంభ సమావేశానికి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు జ్యోతిని ప్రజ్వలించి సదస్సును ప్రారంభించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయం, డీన్ ఇంఛార్జ్ ఆచార్య రామ్ రెడ్డి మాట్లాడుతూ… నేడు ప్రతి ఒక్కరికి రోజువారీ జీవితంలో మానసికమైన శిక్షణ అవసరం అంటూ సదస్సులో దానినీ భాగం చేయాలని సూచించారు. ఆంగ్ల ఆచార్యులు వి.వి.ఎన్. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…. భాషాశాస్త్రం, సామాజిక శాస్త్రాలు, సైకాలజీ అన్నీ ఒకే కుదురు నుంచి వచ్చిన శాఖలంటూ, ఆ దిశగా ఆంగ్లం, సైకాలజీ, చరిత్ర వంటి వాటిని కలిపి అధ్యయనం చేయాలన్నారు. ఫ్రాయిడ్ అనువర్తిత మనోవిజ్ఞానశాస్త్రాన్ని ఎక్కువ ఇష్టపడేవాడని వివరించి, నిర్వాహకులను అభినందించారు. విశ్వవిద్యాలయం సైకాలజీశాఖ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. ఎస్. సుచరిత గోల్డ్ మాట్లాడుతూ… సదస్సు లక్ష్యాలతోపాటు, తమశాఖ మొదటి సంవత్సరంలోనే జాతీయ సదస్సు నిర్వహించడాన్ని గుర్తుచేస్తూ, అందుకు సహకరించిన ఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరికి, డీన్ ఇంచార్జ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. చాణక్య విశ్వవిద్యాలయం నుంచి విచ్చేసిన ఆచార్య హెచ్.ఎస్. అశోక్ మాట్లాడుతూ… వ్యక్తుల దైనందిన జీవితాన్ని అర్థం చేసుకోవడం సైకాలజీ విద్యార్థుల మొదటి కర్తవ్యం, అలా వాళ్లనివాళ్లు తెలుసుకోవడం ద్వారా సమాజానికీ ఉపయోగపడొచ్చని అన్నారు. బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన డాక్టర్ శుభా మధుసూదన్ మాట్లాడుతూ… సైకాలజీ నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఉన్న తేడాను వివరించి, ప్రతి సైకాలజీ విద్యార్థి బాధ్యతాయుతంగా అభ్యాసం ద్వారా సాధన చేయాలన్నారు. బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన మరో అతిథి డాక్టర్ రోహిణి శివానంద మాట్లాడుతూ… కొత్తగా అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు నిర్వహించడం గొప్ప విశేషమన్నారు. ఈ సదస్సు నిర్వహణలో భాగస్వాములైన విశ్వవిద్యాలయ ఉపకులపతి కి, ఉన్నతాధికారులకు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం రెండు సమావేశాలలో నేటి సైకాలజీలోని సాధన, శిక్షణ, పరిశోధన, బోధన వంటి అంశాలపై అధ్యాపకులకు పరిశోధక విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశాలను అనువర్తిత మనోవిజ్ఞానశాఖ అధ్యాపకులైన డాక్టర్ సుచరిత గోల్డ్, డాక్టర్ సునీత, ఆ శాఖ విద్యార్థులు, బోధ నేతర, అధ్యాపకులు , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img