Friday, April 26, 2024
Friday, April 26, 2024

డిసెంబరు 11 న వైద్య ఉద్యోగుల రాష్ట్ర మహాసభ

వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : వైద్య ఆరోగ్యశాఖలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా పయనించేందుకు డిసెంబరు 11న వైద్య ఉద్యోగుల రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.ఆస్కార్ రావు ప్రకటించారు. గురువారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయం ఆవరణలో జరిగిన వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆస్కార్ రావు ప్రధాన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వచ్చే నెల 11 న ఉద్యోగుల రాష్ట్ర సర్వజన మహాసభ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల మహాసభకు ఆల్ ఇండియా నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ మాజీ సభ్యులు గొంగళ్ళ సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వివరించారు. ఉద్యోగుల సమస్యల ఘోష ప్రభుత్వానికి వినిపించేలా రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి విజయవాడకు భారీగా తరలివచ్చి సర్వజన మహాసభను సంపూర్ణ విజయవంతం చేయాలని కోరారు.
సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ కు సన్నద్ధం
సంఘాన్ని మరింత పునరుత్తేజం చేయాలనే రాష్ట్ర సంఘం తీర్మానం మేరకు తాజాగా రాష్ట్ర సంఘం ఎన్నికలకు సన్నదమవుతుంది. రాష్ట్రంలో ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం మరింత పటిష్టం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగతుందని ఆస్కార్ రావు ప్రకటించారు. 11వ తేదీ నాటి వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సర్వజన మహాసభ పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.రమణ, సంయుక్త ప్రధాన కార్యదర్శి బాబా సాహెబ్, జిల్లాల కమిటీల తరపున ఏ.లక్ష్మీనారాయణ(చిత్తూరు), ఎం.వి.వి. సత్యనారాయణ (తూర్పు గోదావరి), ఐ. నారాయణరావు (శ్రీకాకుళం), జే.గోవిందరావు(పశ్చిమ గోదావరి), ఏ.దుర్గా ప్రసాద్, సత్యనారాయణ బాబు(కృష్ణ), ఎస్.ఎన్ భాషా(గుంటూరు), సి.హెచ్. శేషు బాబు(ప్రకాశం), ఎం.సి.నర్సింహులు(కర్నూలు), కె వి ఎస్ ప్రసాద్, శ్రీనివాసరెడ్డి(కడప) తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img