Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకోండి.. ఏఐఎస్ఎఫ్ నాయకులు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణములో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్. జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జగదీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం సిపిఐ కార్యాలయంలో మాట్లాడుతూ కేవలం డిగ్రీ కళాశాలకు ప్రైవేటు బిల్డింగ్స్ సంబంధించి మాత్రమే నడుపుతున్నారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ప్రైవేటు డిగ్రీ కళాశాల సొంత భవనము ఉండి, పైన, అంతస్తులు ఎక్కుటకు కనీస సౌకర్యమును కల్పించాలని తెలిపారు. క్రీడా మైదానం కూడా లేకుండా పోతుందని వారు మండిపడ్డారు. పట్టణంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని తెలిపారు. అయితే సాయి కృప డిగ్రీ కళాశాలకు ఎటువంటి ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఇష్టానుసారం కమర్షియల్ కాంప్లెక్స్ లో కళాశాల నడుపుతుండడం సరైన పద్ధతి కాదని వారు మండిపడ్డారు. డిగ్రీ కళాశాలలు నడపాలంటే ఐదు లేదా ఏడు సంవత్సరాల పాటు అగ్రిమెంట్ ఉండాలని వారు తెలిపారు. అంతేకాకుండా పీహెచ్డీ అర్హత లేకుండా కళాశాల ప్రిన్సిపాల్ గా ఉండడం సరైన పద్ధతి కాదని, యు జి సి పద్ధతిని పాటించాలని తెలిపారు. అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇటువంటి పాఠశాలలపై కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్, నవీన్, బాబావలి, పవన్, మురళి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img