Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రజలను మోసం చేస్తున్న ఫైనాన్స్ పై చర్యలు తీసుకోండి

తాడిపత్రి: స్థానిక యల్లనూరు రోడ్డు విజయలక్ష్మి సినిమా థియేటర్ ఎదురుగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ వద్ద బుధవారము ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గోల్డ్ లోన్ పేరుతో ముత్తూట్ ఫైనాన్స్ ప్రైవేట్ కంపెనీ గోల్డ్ తాకట్టు సమయంలో గోల్డ్ ఎన్ని గ్రాములు ఉంది. వాటి వివరాల రసీదులను ఇవ్వకుండా ప్రజలకు మోసం చేస్తున్నారు. పేద ప్రజలు, రైతులు ఆర్థిక పరిస్థితులు బాగాలేక వారి వద్ద ఉన్న గోల్డ్ ను ముత్తూట్ ఫైనాన్స్లో ఎంతో నమ్మకంతో తాకట్టు పెడుతూ ఉంటారు. గోల్డ్ తాకట్టు పెట్టిన వారు ఇబ్బందుల దృష్ట్యా సమయానికి లోను చెల్లించ లేకపోతే వారికి నోటీసు ఇవ్వాలి. కానీ ఫైనాన్స్ వారు ఇదే అదును గా చూసుకొని బంగారు తాకట్టు పెట్టిన వారికి నోటీసు ఇవ్వకుండా నోటీస్ బోర్డ్ లో అతికించ కుండా పేపర్ ప్రకటన ఇవ్వకుండా ఇష్టానుసారం వేలం వేసి అమ్ముకుంటున్నారు. దీంతో 50వేలు రుణం తీసుకున్న ప్రజలు లక్షలలో నష్టపోవాల్సిస్తోంది. కావున ఈ ఫైనాన్స్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారు లైన ఎస్పీ, కలెక్టర్, స్థానిక ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్తామని వీలైతే ఆమరణ నిరాహార దీక్షలకు వెనుకాడబోమని ఫైనాన్స్ వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చంద్రశేఖర్, రామాంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img