Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

జీవానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పై చర్యలు గైకొనండి

ఆర్యుఎస్ఎఫ్– రాష్ట్ర ఉపాధ్యక్షులు పిక్కిలి మహేష్
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్- జీవానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, విద్యను వ్యాపారం చేస్తోందని ఆ పాఠశాలపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిక్కిలి మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల ఆవరణ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ జీవానంద స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ ఫీజులు వసూలు చేయడం దారుణమన్నారు. జీవానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా లక్షలాది రూపాయలు, పుస్తకాల పేరిట,యూనిఫామ్ పేరిట,వసూలు చేయడం జరుగుతుందన్నారు.ఈ విషయంపై విద్యాశాఖ అధికారి కి,అదేవిధంగా ఆర్డీవో కి, శ్రీ సత్య సాయి జిల్లా డీఈఓ కి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఈ రాయలసీమ జిల్లాల్లో కరువు కాటకాలతో విలవిలాడుతున్న తరుణంలో అనంతపురం జిల్లాలో వర్షాలు లేక చాలామంది వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిం దన్నారు. జీవానంద పాఠశాల పై చర్యలు తీసుకోని ఎడల ఆర్ యు ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలను విద్యార్థి సంఘాలను ఐక్యం చేసుకొని, పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ యు ఎస్ ఎఫ్ నాయకులు పవన్ కుమార్, అభిలాష్ కుమార్, రాఘవరెడ్డి, బాబావాలి, మహేష్, రాకేష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img