Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ఆర్థిక సహాయాన్ని అందించిన టిడిపి ఇన్చార్జ్ కృష్ణాపురం జమీర్ అహ్మద్

విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గ మైనారిటీ ప్రధాన కార్యదర్శి బాబా యొక్క తల్లి అనారోగ్యంగా ఉండడం వలన పదవ వార్డ్ టిడిపి ఇన్చార్జ్ కృష్ణాపురం జమీర్ అహ్మద్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లి బాబా తల్లిని పరామర్శించి వైద్య ఖర్చులకోసం వారు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం జమీర్ అహ్మద్ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో తన తోటి పార్టీ నాయకునికి తన వంతుగా సహాయం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img