Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

నేడే పౌర్ణమి గరుడ సేవ

ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రమణ్యం

విశాలాంధ్ర – ధర్మవరం : తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో జరిగే విధంగా సాంప్రదాయ పద్ధతిలో ధర్మవరం పట్టణంలో కూడా కొన్ని నెలలుగా ప్రతినెల పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ను గరుడసేవగా ఆసీనులు చేసి ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహించి, ఈనెల ఆరవ తేదీ గురువారం సాయంత్రం పట్టణ పురవీధులలో ఊరేగింపు నిర్వహిస్తామని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రమణ్యం ఉపాధ్యక్షులు కుండా చౌడయ్య ఆలయ ఈవో వెంకటేశులు బుధవారం ఒ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పౌర్ణమి గరుడసేవ అనే కార్యక్రమాన్ని దాతల సహాయ సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ భక్తాదులకు దర్శనమును గావించబడుతోందని తెలిపారు. గరుడ సేవ దాతలుగా నీలూరు రాధమ్మ , నీలూరు శ్రీనివాసులు అండ్ సన్స్- నవీన్ సిల్క్ హౌస్- ధర్మవరం వారు వ్యవహరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్ లు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తాదుల నడుమ స్వామివారికి విశేష అలంకరణ గావించి, ప్రత్యేక పూజలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. కావున భక్తాజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి గరుడ సేవలో ఆశీస్సులు పొందాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img