Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రధమ చికిత్స పై శిక్షణ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : పన్నెండు రోజుల శిక్షణ కార్యక్రమం లో భాగంగా 6 వ రోజున స్థానిక పంగల్ రోడ్ టీటీడీసీ లో గురువారం కేర్ ఇండియా రెడ్ క్రాస్ సౌజన్యంతో శిక్షణ కు వచ్చిన అందరికీ
రక్త గ్రూపు నిర్ధారణ చేయించడం జరిగింది. అదేవిధంగా రెడ్ క్రాస్ తరుపున ప్రథమ చికిత్స శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి జి. మోహన్ కృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విపత్కరపరిస్థితులలో,యాక్సిడెంట్స్ జరిగినపుడు ఏ విధంగా బాధితులకు ప్రథమ చికిత్స చేయాలని ప్రయోగాత్మకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఆర్ గూర్చి,బ్యాన్డేజ్, రికవరీ, పాము కాటు,తెలుకాటు,కాలిన గాయాలకు,వడదెబ్బ తగిలినప్పుడు ఏ విధంగా బాధితులకు ప్రథమ చికిత్స చేయాలని వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ,కేర్ ఇండియా ప్రతినిధి దాదా పీర్ , ట్రైనింగ్ ఇంచార్జి నిర్మల్ దాస్, శిక్షకుడు ఎం.. రాయుడు, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ బి.రమేష్ వివిధ మండలాల వాలంటీర్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img