Friday, May 3, 2024
Friday, May 3, 2024

పౌష్టికాహారంతోనే క్షయ వ్యాధి నయం

విశాలాంధ్ర – తాడిపత్రి: పౌష్టికాహారం భుజించడం తోనే క్షయ వ్యాధి నయమవుతుందని లైన్స్ క్లబ్ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి చెప్పారు. మండలంలోని చుక్కలూరు ప్రాథమిక హాస్పిటల్ లో మంగళవారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి నయం కావాలంటే మందుల తోపాటు పౌష్టి కాహారం క్రమం తప్ప కుండా తీసుకుంటునే వ్యాధి నయమవు తుందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులను దృష్టిలో ఉంచుకుని లైన్స్ క్లబ్ ఆధ్వర్యం లో దాత అరవింద నారాయణ రెడ్డి సహకారంతో ప్రతి నెల ప్రధానమంత్రి క్షయ వ్యాధి ముక్తా భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా దాదాపు మూడు నెలల నుండి 35 మంది క్షయ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో దాత అరవింద్ నారాయణ రెడ్డి డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ లావణ్య డాక్టర్ సుధాకర్ సూపర్వైజర్ సునీల్, లైన్స్ క్లబ్ సభ్యులు రాజేశ్వరి, హైమవతి,హరిత, సంజీవరెడ్డి రాజా నాయుడు, నాగేశ్వర రెడ్డి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img