Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

శాంతి భద్రతలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి


విశాలాంధ్ర – ధర్మవరం : శాంతి భద్రతల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు భద్రత కల్పిస్తామని డి ఐ జి అమ్మిరెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఐజి, ఎస్పీలు గురువారం రాత్రి ఆకస్మికంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్లోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తదుపరి వారు డి.ఎస్.పి హుస్సేన్ భాష, వన్ టౌన్, టూ టౌన్ సిఐ, ట్రాఫిక్ సిఐ లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నామని వారు తెలిపారు. మట్కా, జూదం, పేకాట తదితర దురాలవాట్ల పై ప్రత్యేకంగా ఉంచడం జరిగిందన్నారు. చట్టపరంగా పోలీసులు ప్రజలకు అన్నివేళలా న్యాయం జరిగే విధంగా విధులను నిర్వర్తించాలని వారు తెలిపారు.. పట్టణము గ్రామీణ ప్రాంతాలలో ఫ్యాక్షనిజం పూర్తి మాఫీ చేసే దిశలో పోలీసులకు తగు జాగ్రత్తలు తీసుకోవలసిన చర్యల పైన కూడా దృష్టి పెట్టడం జరిగిందన్నారు. మహిళా పోలీసుల ద్వారా ఎక్కడా ఎటువంటి నేరాలు జరగకుండా వారి ఇచ్చే సమాచారంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాలను అలర్ట్ చేస్తున్నామని తెలిపారు. నేరాలను అరికట్టేందుకు ఆయా పోలీస్ స్టేషన్లో తీసుకోవలసిన సూచనలు, పాటించాల్సిన పద్ధతులను కూడా తెలియపరచడం జరిగిందన్నారు. నేరాలను అదుపు చేయుటలో పోలీస్ స్టేషన్లోని సిఐ,ఎస్ఐ లకు ప్రత్యేక ఆదేశాలను ఇవ్వడం జరిగిందన్నారు. పట్టణ పోలీసులతోనూ సచివాలయ మహిళా పోలీసులకు, ఎప్పటికప్పుడు సమావేశాన్ని నిర్వహించి, ఎటువంటి నేరాలు జరగకుండా, శాంతి భద్రతలను కాపాడే దిశలో తమ విధులను కొనసాగించాలని తెలిపారు. ప్రణాళిక పద్ధతిలో ప్రజలందరికీ న్యాయం చేసేలా పోలీసులు తమ విధులను నిర్వర్తించాలని తెలిపారు. “కాఫీ విత్ మెన్” అనే కార్యక్రమంతో అందరిని స్నేహపూర్వక భావంతో పనిచేసే విధంగా ఉండాలని సూచించడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే వారిని గౌరవంగా పలకరిస్తూ, మానసిక ధైర్యాన్ని నింపేలా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం, టూ టౌన్ సిఐ రాజా, ట్రాఫిక్ సిఐ వహీద్ భాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img