Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఉరవకొండ పట్టణంలో పట్టపగలే చోరీ

రూ.1.50 లక్షల నగదు 25 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ సమీపంలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రసాద్,ఉష దంపతుల ఇంట్లో గురువారం పట్టపగలే దొంగలు ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న రూ.1.50 లక్షలతో పాటు 25 తులాల బంగారంతో పాటు వివిధ వెండి ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారు. ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడంతో ఉదయమే డ్యూటీ కి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఉపాధ్యాయురాలు ఉష ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటన స్థలాన్ని ఉరవకొండ పట్టణ సిఐ హరినాథ్ ఎస్సై వెంకట్ స్వామి మరియు సిబ్బంది పరిశీలించి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img