Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఎయిడ్స్‌పై నాటక రూపంలో అవగాహన

విశాలాంధ్ర`ఉరవకొండ : ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్టు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉరవకొండ పట్టణంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఎయిడ్స్‌ పై వీధి నాటక రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ నిర్వాహకులు మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యాధి వ్యాపించడానికి ప్రధానంగా నాలుగు రకాల కారణాలు ఉన్నాయని వాటిలో ప్రధానంగా సురక్షితం కానీ లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి, హెచ్‌ఐవి సోకిన తల్లి నుంచి బిడ్డకు, కలుషితమైన సూదులు చిరంజీలు ద్వారా వ్యాపించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్‌ మహేష్‌, కిరణ్‌ కుమార్‌, ఏఎన్‌ఎం వరలక్ష్మి, మరియు శివయ్య కళాబృందం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img