Friday, May 3, 2024
Friday, May 3, 2024

గర్భిణులకు వైద్య పరీక్షలు

విశాలాంధ్ర`బొమ్మనహల్‌ : గర్భిణీలు పౌష్టిక ఆహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని గర్భవతులకు వైద్య సిబ్బంది సూచించారు. శుక్రవారం మండలంలోని బండూరు గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. బీపీ, షుగర్‌ తదితర పరీక్షలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం డ్రైడే సందర్భంగా ఎక్కువ రోజులు నీటిని నిలువ చేస్తే దోమల వ్యాప్తి చెంది రోగాల బారిన పడతారని నీటిని ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదని తెలిపారు. దోమలు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ యుగంధర్‌ ఆరోగ్య కార్యకర్త గోవర్ధన్‌ ఏఎన్‌ఎం విజయలక్ష్మి ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img