Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గుంతకల్లులో సిపిఐ పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశం…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్

విశాలాంధ్ర- గుంతకల్లు : సిపిఐ పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశం శనివారం గుంతకల్లు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సమావేశాన్ని సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.గోవిందు, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ నియోజవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ మాట్లాడుతూ జగన్ నియంత పోకడల వల్ల ప్రతి పక్ష పార్టీలు హైకోర్టులో ప్రతి పార్టీ ఒక లాయరు ను పెట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడాయని అన్నారు.కడప లో ఉక్కు కర్మగార సాధనకు సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ మరియు పార్టీ నాయకులు శాంతియుత పాదయాత్రలకు అనుమతి కోరితే ప్రభుత్వం అనుమతి ఇవ్వనందు వల్ల హైకోర్టును ఆశ్రయించి అనుమతి తీసుకొని పాదయాత్రలు చేశామన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రయో జనాల కోసం ప్రత్యేక హోదా సాధన కోసం విద్యర్ధి , యువజన, మేధావి సంఘాలు బస్సు యాత్రచేపడితే జగన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించినందువల్ల హైకోర్టులో వారు కూడా అనుమతి పొంది బస్సు యాత్రకు ఉపక్రమిస్తున్నారని తెలిపారు. జనవరి 27 న టిడిపి ప్రతిపక్ష నాయకుడు లోకేష్ జరపతలపెట్టిన పాదయాత్రలకు కూడా ఈ నియంత జగన్ అనుమతి ఇస్తాడనే నమ్మకం లేదన్నారు. మరలా వారు కూడా హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందే మే? జగన్ కు ఓటమి భయం పట్టుకున్నందు వల్ల ఇలాంటి అప్రజా స్వామిక చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. అందులో భాగమే జిఓ నంబర్ 1 ను తీసుకొని వచ్చి , సభలు, సమావేశాలు, రోడ్ షోల పై నిషేధం విధిస్తే మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామక్రిష్ణ జీవోను న్యాయ స్థానంలో సలాల్ చేస్తే హైకోర్టు జీవో పై స్టే విధించి తే దానిని రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామక్రిష్ణ జీవో ను న్యాయ స్థానంలో సవాల్ చేస్తే హైకోర్టు జీవో పై స్టే విధించి తే దానిని అంగీరించకుండా సుప్రీం కోర్టుకు జగన్ ప్రభుత్వం పోతే ఆ కోర్టులో కూడా ఈ ప్రభుత్వానికి చీవాట్లు తప్పలేదని జగదీష్ విమర్శించారు. సిగ్గులేని ముఖ్యమంత్రి నాయ స్థానాలు ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా నైతిక బాధ్యత వహించి పదవి నుండి తప్ప కోకుండా అంటి పెట్టుకొని కూర్చున్నాడన్నారు. ఇక ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పే పరిస్థితులు వచ్చాయన్నారు. అందువల్ల పార్టీ కార్యకర్తలందరూ ఈ రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడుట కొసం , ప్రజా ఉద్యమాలలో వేగం పెంచాలని కార్యకర్తలకు ఉద్బోదించారని తెలిపారు.ఈ సమావేశంలో సీపీఐ రూరల్ పార్టీ కార్యదర్శి రాము, పట్టణ సహాయ కార్యదర్శి మహామ్మద్ గౌస్, వ్యవసాయ కర్మిక సంఘం జిల్లా నాయకుడు దేవేంద్ర, మహిళా సమాఖ్య నాయకురాలు రామాంజనమ్మ , ఏఐఎస్ ఎఫ్ నాయకులు వెంకట్ నాయక్, వినోద్, ఏఐ వైఎఫ్ శివనంద తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img