Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలి

డిజిహెచ్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మీనుగాగోపాల్‌

విశాలాంధ్రఉరవకొండ : మహిళ సాధికారతకు నిలువెత్తు రూపం ఆడపిల్లల చదువుల కోసం కృషిచేసిన మహిళ మణిపూస సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని దళిత గిరిజన హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు మీనుగా గోపాల్‌ అన్నారు. సావిత్రిబాయి పూలే 192 వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఉరవకొండ లోని రోడ్లు భవనాల అతిథి గృహంలో నిర్వహించి ఆమెకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందడమే కాకుండా ఆడపిల్లలు చదువుకుని వారు చైతన్యవంతులు కావాలని వారికోసం ఎన్నో పాఠశాలలను నిర్వహించిన ఘనత సావిత్రిబాయి పూలే కి దక్కిందన్నారు. సమాజంలో ఎదురవుతున్న అవమానాలను సైతం లెక్కచేయకుండా మహిళల చదువుతోపాటు బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తిని సందర్భంగా ఆమెని ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ ప్రజా సమైక్య అధ్యక్షులు బి. రమేష్‌, ప్రధాన కార్యదర్శి చిరంజీవి,వెంకటేశులు, దళిత గిరిజన హక్కుల సమితి నాయకులు ఈశ్వర్‌,మారుతి ఓబయ్య, కృష్ణ మురళి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img