Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అక్రమంగా మద్యం తయారీ, రవాణాపైన ఉక్కుపాదం

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై సీఎం జగన్‌ సమీక్ష
అక్రమంగా మద్యం తయారీపైన..అక్రమ రవాణాపైన ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై సీఎం జగన్‌ సమీక్ష గురువారం సమీక్ష నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యకలాపాల ప్రగతిపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక ఆదేశాలిచ్చారు. మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని, మూడిరట ఒక వంతు దుకాణాలను మూసివేశామని, బెల్టుషాపులను,పర్మిట్‌రూమ్‌ల తీసేశామని ముఖ్యమంత్రి చెప్పారు.లిక్కర్‌ సేల్స్‌ నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గాయని తెలిపారు. బీరు సేల్స్‌ నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయి. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అధికారులు అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణాపైన, అక్రమంగా మద్యం తయారీపైన ఉక్కుపాదం మోపాలన్నారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చామని, దీన్ని అమలు చేయాలని ఆదేశించారు.
ఇక నిర్దేశించిన రేట్లకన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. ఎస్‌ఈబీ కాల్‌సెంటర్‌ నంబర్‌పై బాగా ప్రచారం చేయాలన్నారు. ఇక గంజాయి సాగు, రవాణాను అరికట్టాలని సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలని.. పోలీసు విభాగాల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలపైన పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపైన దృష్టిపెట్టాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశానికి ప్లానింగ్‌ అండ్‌ రిసోర్స్‌ మొబలైజేషన్‌ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కే వీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్‌, ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌, ఎస్‌ఈబీ డైరెక్టర్‌ (స్పెషల్‌ యూనిట్స్‌) ఏ రమేష్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img