Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

అత్యవసర చికిత్స కోసం..వాట్సప్‌ గ్రూప్‌

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు వెంటనే వైద్యం అందించేందుకు అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. అంబులెన్స్‌, ఆసుపత్రి సిబ్బందితో కలిసి వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటుచేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ముందు వారి వివరాలను వాట్సప్‌ ద్వారా తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆ వివరాలకు అనుగుణంగా అత్యవసర చికిత్స అందించేందుకు సంబంధింత వైద్యులు సిద్ధంగా ఉంటారని, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img