Monday, December 5, 2022
Monday, December 5, 2022

గుంతలు పూడ్చలేరు, రోడ్లు వేయలేరు, కానీ రోడ్డు విస్తరణ చేస్తారా?

పవర్‌ స్టార్‌..జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు ఇప్పటంలో పర్యటించనున్నారు. దీంతో పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. సీఎం జగన్‌కు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అరెస్టు చేసుకుంటే అరెస్టు చేసుకోనివ్వండని ఛాలెంజ్‌ చేశారు. మిస్టర్‌ జగన్‌..నీ ఇడుపులపాయలో హైవే వేస్తానంటూ హెచ్చరించారు పవన్‌ కళ్యాణ్‌. జనసేన సభకు స్థలమిచ్చినందుకే ప్రభుత్వం ఇళ్లను కూలగొట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్చిలో మా సభకు భూమి ఇస్తే%ౌౌ% ఏప్రిల్‌ లో ఇళ్లను కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. గుంతలు పూడ్చలేరు, రోడ్లు వేయలేరు, కానీ రోడ్డు విస్తరణ కావాలా అని నిలదీశారు పవన్‌ కళ్యాణ్‌. పోలీసులు%ౌౌ% రేపిస్టులు, ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారని నిప్పులు చెరిగారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img