Monday, April 22, 2024
Monday, April 22, 2024

అసలు సినిమా వారికి ఏపీ అంటే గుర్తుందా?

: వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి
అసలు సినిమా వారికి ఏపీ అంటే గుర్తుందా? అని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. ఎంతసేపటికీ హైదరాబాద్‌లో ఉంటూ తెలంగాణలో సినిమాలు తీసుకుంటూ ఏపీ గురించి ఏనాడైనా ఆలోచించారా? అని నిలదీశారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రసన్నకుమార్‌ మాట్లాడారు. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే తప్పెంటని ప్రశ్నించారు. టిక్కెట్‌ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేంటని ఆయన సమర్ధించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img