Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఆలస్యం లేకుండా ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేయాలి

సజ్జలకు గ్రామ, వార్డు సచివాలయం ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి
ఆలస్యం లేకుండా ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేయాలని గ్రామ, వార్డు సచివాలయం ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ బత్తుల అంకమ్మరావు, రాష్ట్ర అదనపు జనరల్‌ సెక్రటరీ డా.బి.ఆర్‌.ఆర్‌ కిషోర్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డిని వీరు కలిసి ప్రొబేెషన్‌ డిక్లరేషన్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, ఆత్మ గౌరవ సమస్యలపై వివరించారు. అయితే ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియ జూన్‌ నెలలోపు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అంతకంటే ముందే చేయలంటే సీఎం పున:సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమస్యను తిరిగి ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లి ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ విషయాన్ని, అలానే పే స్కేలు ప్రొబేెషన్‌ పూర్తయినప్పటి తారీఖు నుండి (ఎవరికైతే రెండు సంవత్సరములు పూర్తయినదో ఆ తేదీ నుండి) ఎరియర్స్‌ విషయమై సీఎంతో చర్చించి ఉద్యోగులకు మేలు చేకూరేవిధంగా చర్యలు తీసుకుంటామని సజ్జల చెప్పారన్నారు. కొత్త పేస్కేలు 11వ పీఆర్సీ కూడా వర్తిస్తుందని చెప్పారని తెలిపారు. ఈ విషయమై అధికారికంగా ప్రకటించే ఏర్పాటు త్వరలోనే చేయుటకు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img