Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఇబ్బందిగా ఉంటే సినిమా వాయిదా వేసుకోవచ్చు : మంత్రి పేర్ని నాని

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే రాత్రి కర్ఫ్యూ, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని తీసుకున్నామని మంత్రి పేర్ని నాని అన్నారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ఈ నిర్ణయం ఇబ్బందికరంగా ఉంటే వాయిదా వేసుకోవచ్చని అన్నారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వర్మలాగే ఎవరైనా వచ్చి టికెట్‌ ధరల తగ్గింపు విషయంపై తమతో మాట్లాడవచ్చని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. సినిమాటోగ్రఫీ నిబంధనల మేరకే రేటు నిర్ణయించినట్లు తెలిపారు. 2013 లో జారీ చేసిన జీవో నెం 100తో పోలిస్తే ధరలు పెంచే ఇచ్చామన్నారు. ఒకవేళ ఈ ధరలు ఎవరికైనా సహేతుకంగా లేవనిపిస్తే నేరుగా వచ్చి కమిటీకి చెప్పవచ్చని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img