Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. కేంద్రానికి సీఎం జగన్‌ లేఖ

ఉక్రెయిన్‌ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో భారతీయులు స్వదేశం రావాలని కేంద్రప్రభుత్వం పిలుపునిచ్చింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ఈ సందర్భంలో రాష్ట్ర సీఎం జగన్‌ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డా. జై శంకర్‌ కి లేఖ రాశారు.ఉక్రెయిన్‌ నుండి భారతదేశానికి చెందిన భారతీయులను స్వదేశానికి రప్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులను అప్రమత్తం చేసింది.మరోవైపు ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో నాలుగు వారాలుగా ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ పలు చర్యలు తీసుకుంది. ఉక్రెయిన్‌ లో ఉన్న తెలుగు వారి గురించి తెలుసుకునేందుకు ఉక్రెయిన్‌ లోని భారత రాయబార కార్యాలయానికి అధ్యక్షుడు వెంకట్‌ ఎస్‌. మేడపాటి జనవరి 30న ఇ మెయిల్‌ పంపారు. ఈ ఇ మెయిల్‌ లో అక్కడ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగుల జాబితా పంపమని, అలాగే భారతదేశానికి తిరిగి వెళ్లడానికి సుముఖంగా ఉన్న తెలుగు విద్యార్థులు, ఉద్యోగుల సమాచారాన్ని అందించమని కోరారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని తెలుగు వారి సమాచారం కోసం జగన్‌ సర్కార్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది.ఏపీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 0863- 2340678 అని ఓ ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగువారిని భద్రంగా రప్పించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img