Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

ఉద్యోగులు ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం లేదు : సజ్జల

ఉద్యోగులతో పీఆర్సీపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇవాళ ఏపీలో ఉద్యోగ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమం చేపట్టాయి. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా జీవితం స్తంభింపజేయడం ఎంత వరకు కరెక్ట్‌ అని అన్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దన్నారు. చేసే అవకాశం లేని డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారన్నారు. ప్రభుత్వం ఎంత చేయగలదో అంతా చేస్తోందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img