Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీలో అన్ని శాఖలు అవినీతిమయం : పురందేశ్వరి

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ఏపీ అంశాలపై స్పందించారు. ఏపీని కేంద్రం మోసం చేసిందన్న ప్రచారం అవాస్తవం అని స్పష్టం చేశారు. విభజన హామీలు అన్నింటిని కేంద్రం నెరవేరుస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం హామీ ఇచ్చినట్టుగానే, రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో అన్ని శాఖల్లోనూ అవినీతి పేరుకుపోయిందని పురందేశ్వరి విమర్శించారు. ఏపీలో మద్యం విక్రయాలపై డిజిటల్‌ పేమెంట్స్‌ ఎందుకు ఆమోదించడంలేదని ఆమె ప్రశ్నించారు. ఏలూరులో కార్పొరేషన్‌ శ్మశానాల్లో అంత్యక్రియలకు రూ.5 వేలు చొప్పున వసూలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం దివాళా దిశగా పయనిస్తోందనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img