Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

ఏపీ, ఒడిశా కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు…

తుపాన్‌ ప్రభావంతో ఏపీ, ఒడిశా కోస్తా జిల్లాల్లో ఈ నెల 10 వతేదీ వరకు భారీవర్షాలు కురవవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడిరచింది. శుక్రవారం దక్షిణ అండమాన్‌ సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో విస్తరించి అల్పపీడనంగా మారింది.ఈ అల్పపీడనం మే 8 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం వాయువ్య దిశగా కదులుతూ రానున్న 12 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి ఆదివారం సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉంది. తుపాన్‌ వల్ల వచ్చే వారం ప్రారంభంలో ఏపీ, ఒడిశా తీరాలు, తూర్పు కోస్తా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img