Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ పాలిసెట్‌-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివద్ధి శిక్షణశాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఫలితాలను బుధవారం విడుదల చేశారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా శ్రీకాకుళం, అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా నెల్లూరు అని పేర్కొన్నారు. అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా ప్రకాశం అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్‌, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్మెంట్‌, ట్రైనింగ్‌ డైరెక్టర్‌ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజులు పాల్గొన్నారు. 74,884 మంది విద్యార్థులు ఈ సంవత్సరం పాలిసెట్‌కు దరఖాస్తు చేయగా.. ఇందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. 64,187 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన కె రోషన్‌లాల్‌, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివేక్‌వర్ధన్‌ మొదటి ర్యాంకు సాధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img