Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఏపీ మంత్రులు కొడాలి, పేర్ని నానిలకు నిరసన సెగ

ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు పవన్‌ కల్యాణ్‌ అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. ‘భీమ్లా నాయక్‌’ సినిమా ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై ఇప్పటికే పవన్‌ అభిమానులు మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో కృష్ణ జిల్లా గుడివాడలో జీ3 భాస్కర్‌ థియేటర్‌ను ప్రారంభించేందుకు మంత్రులు వచ్చిన వచ్చిన సందర్భంగా ఈ సంఘటన ఎదురైంది. మొదటి సినిమాగా భీమ్లా నాయక్‌ను ప్రదర్శిస్తుండడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు అక్కడికి చేరుకుని మంత్రి పేర్నినానికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. అయితే మంత్రులను అడ్డుకునేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పవన్‌ సినిమాను కక్షపూరితంగా అడ్డుకోవడం దారుణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img