Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

ఏ కారణంతో ప్రభుత్వంపై యుద్దం చేస్తున్నారో చెప్పాలి

మంత్రి కురసాల కన్నబాబు
పవన్‌ కల్యాణ్‌ ఏ కారణంతో ప్రభుత్వంపై యుద్దం చేస్తున్నారో చెప్పాలని మంత్రి కురసాల కన్నబాబు సూటిగా ప్రశ్నించారు.కొవిడ్‌ సమయంలో పేదలను ఆదుకున్నందుకు యుద్దం చేయాలా? అని నిలదీశారు.ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం పెట్టింనందుకు యుద్దం చేయాలా? అని మండిడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ పేదరికంపై యుద్ధం ప్రకటించారని తెలిపారు. అందుకే సీఎం వైఎస్‌ జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. శ్రమదానం పేరుతో పవన్‌ కల్యాణ్‌ పబ్లిసిటీ స్టంట్‌ చేశారని, ఈ తరహా శ్రమదానం పవన్‌ ఒక్కరే చేయగలరేమో అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తోడు లేకుండా పవన్‌ రాజకీయం చేయలేరని దుయ్యబట్టారు. రోడ్లు పూడుస్తామని చెప్పి కుల రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img