Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

విజయవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలో నిజామాబాద్‌ నుంచి కనకదుర్గమ్మ దర్శనానికి విజయవాడ వచ్చిన పప్పుల సురేష్‌ కుటుంబం కన్యకా పరమేశ్వరి సత్రంలో రూమ్‌ అద్దెకు తీసుకున్నారు. ఈ తెల్లవారుజామున అప్పుల బాధతో చనిపోతున్నట్లు బంధువుకు మెసేజ్‌ పెట్టారు. తల్లీ, కొడుకు కన్యకా పరమేశ్వరి సత్రంలో విషం తాగి ఆత్మహత్య చేసుకోగా.. తండ్రీ, కొడుకు కృష్ణానదిలో దూకి గల్లంతయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img