Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

కుటుంబసమేంతంగా.. కృష్ణ పార్థీవ దేహానికి నివాళులర్పించిన బాలకృష్ణ

అభిమానులు..ప్రజల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో సూపర్‌ స్టార్‌ కృష్ణ పార్థీవ దేహాన్ని ఉంచారు. కాగా నేటి ఉదయం నానక్‌ రామ్‌ గూడలోని ఆయన నివాసం నుంచి పద్మాల స్టూడియోకు తీసుకెళ్లారు. పలువురు ప్రముఖులు పద్మాలయ స్టూడియోకు వచ్చి కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ, కోట శ్రీనివాసరావు సహా పలువురు ప్రముఖులు కృష్ణ పార్థీవ దేహంపై పూలు చల్లి నివాళులు అర్పించారు. మరోవైపు తమ అభిమాన నటుడిని చివరి చూపు చూసి వీడ్కోలు పలికేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. పద్మాలయా స్టూడియోస్‌ నుంచి మహాప్రస్థానం వరకూ కృష్ణ భౌతికకాయాన్ని తీసుకెళ్తారు. కృష్ణ మృతికి సంతాపంగా తెలుగు చిత్ర పరిశ్రమ షూటింగ్‌లు బంద్‌కి పిలుపునిచ్చింది. పలుచోట్ల సినిమా హాల్‌లను మూసివేశారు. మరోవైపు కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు సూచనలు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img