Friday, December 2, 2022
Friday, December 2, 2022

దిల్లీ పర్యటనలో ఏపీ హోంమంత్రి..

నేడు, రేపు కేంద్ర హోంశాఖ చింతన్‌ శిబిర్‌

‘విజన్‌ 2047’ లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన చింతన్‌ శిబిర్‌ (మేథోమథనం)లో ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి తానేటి వనిత పాల్గొననున్నారు. గురు, శుక్రవారాల్లో హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరగనున్న ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల హోంమంత్రులు, డీజీపీలు, హోంశాఖ ఉన్నతాధికారులను కేంద్ర హోంశాఖ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే ఏపీ హోంమంత్రి తానేటి వనిత దిల్లీ చేరుకున్నారు. బుధవారం దిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌, అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాన్షు కౌశిక్‌తో ఆమె సమావేశమయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img