Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం…

దువ్వ జాతీయ రహదారిపై రైతుల ధర్నా
విశాలాంధ్ర`తణుకు: పండిరచిన ధాన్యం కొనుగోలు చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటూ రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి సాఫ్ట్‌ వేర్‌ పనిచేయకపోవడంతో గురువారం ఉదయం నుండి రాత్రి 10గం ల వరకు దాన్యం లారీలతో రైతులు ఎదురు చూశారు. శుక్రవారం ఉదయం కూడా సాఫ్ట్‌ వేర్‌ పనిచేయక పోవడంతో విసుకు చెందిన 300మంది రైతులు దువ్వ జాతీయ రహదారి కూడలి నందు రహదారి పై బైటాయించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 4 గంటల పాటు జాతీయ రహదారిపై 10 కిమీ పొడవునా వాహనాలు ఎక్కడకక్కడే ఆగిపోయాయి. ట్రాఫిక్‌ స్తంభించింది.రైతులు కిరోసిన్‌, పెట్రోల్‌, పురుగుమందు డబ్బాలతో ఆత్మ హత్యలే శరణ్యం అంటూ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నాలు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు రైతుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపద్యంలో నరసాపురం సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజ, జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ శివరామ్‌ ప్రసాద్‌, పౌరసరఫరాల శాఖ అధికారి మురళి కృష్ణ, తహసీల్దార్‌ పీ ఎన్‌ డీ ప్రసాద్‌ తదితరులు వచ్చి రైతులతో చర్చించారు. రైతులు మాట్లాడుతూ సుమారు 4వేల ఎకరాలు పైన ఉన్న దువ్వ గ్రామంలో రోజుకు 50 లారీలు చొప్పున దాన్యం కొనుగోలు జరపాలని, కాని రోజుకు 5 లారీల చొప్పున చేస్తున్నారని ఆవేదన వ్యక్తం ఇదే విధంగా ధాన్యం కొనుగోలు చేస్తే 5 నెలల సమయం పడుతుందని వాపోయారు.సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజ మాట్లాడుతూ రోజుకు 50 లారీలు చొప్పున ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాఫ్ట్‌ వేర్‌ సర్వర్‌ పనిచేయక పోవడం వాస్తవమేనని ఆఫ్‌ లైన్లో కూడా కొనుగోళ్లు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సబ్‌ కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img