Friday, August 19, 2022
Friday, August 19, 2022

పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే ఇంగ్లీష్‌ మీడియం

మంత్రి తానేటి వనిత
ఇంగ్లీష్‌ మీడియంపై చంద్రబాబు వ్యాఖ్యలకు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కౌంటర్‌ ఇచ్చారు. ‘‘వాళ్ల పిల్లలను విదేశాల్లో ఇంగ్లీష్‌ మీడియం చదివించుకోవచ్చు.. పేదలు ఇంగ్లీష్‌ చదువులు చదవకూడదన్నదే చంద్రబాబు రూల్‌’’ అంటూ మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవ్వేనా?.ఇంగ్లీష్‌ మీడియం చదువుకుంటే మొద్దబ్బాయిల్లా మారతారని తమకు ఇప్పటివరకూ తెలియదు. అలా కూడా ఆలోచించవచ్చా అని ప్రతిపక్షనేత చెప్పే వరకూ తెలియదంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ను పిల్లలందరూ మేనమామగా భావిస్తున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే ఇంగ్లీష్‌ మీడియం’’ అని మంత్రి తానేటి వనిత అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img