Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

పులివెందుల పర్యటనకు సీఎం జగన్‌

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17వ తేదీన పులివెందులలో పర్యటన దృష్ట్యా అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం కడప ఎస్పీ అన్బురాజన్‌ పరిశీలించారు. భాకరాపురంలో గల హెలీప్యాడ్‌ను, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన నేతలు, నాయకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలో పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. అలాగే హెలీప్యాడ్‌ నుంచి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ వరకు ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన రానుండటంతో ఆయా ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాజు, బాలమద్దిలేటి, ఎస్‌ఐలు గోపినాథరెడ్డి, చిరంజీవి, హాజివల్లి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img